Log In

 

Company Name : Roshni Crop Sciences Pvt Ltd.

Saturday, June 17, 2017 4:00PM IST (10:30AM GMT)

భారతదేశంలో ఫోలియర్‍ బ్లెండ్‍ సూపర్‍ ఫెర్టిలైజర్‍ను ప్రవేశపెట్టిన సుమిటొమొ క్రాప్‍


Hyderabad, India

జపాన్‍కు చెందిన సుమిటొమి కార్పొరేషన్‍ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక ఉత్పాదనను రోష్ని క్రాప్‍ సైన్సెస్‍ ప్రై.లి.తో  కలసి ఈ వారం ఆరంభంలో భారతదేశంలో ప్రవేశపెట్టింది.  నూతన తరం సాంకేతికతకు ప్రాతినిథ్యం వహించే ఫోలియర్‍ బ్లెండ్‍ కోబాల్ట్, మాంగనీస్‍, జింక్‍, బోరాన్‍, మెగ్నీషియం వంటి కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్, ఎసెన్షియల్‍ ప్లాంట్‍ సూక్ష్మపోషకాలను మరియు సాధారణ ఎన్‍-పి-కె ఎరువుల్లో ఉండని పోషక అనుబంధాలను కలిగి ఉంటుంది. స్టెబిలైజ్డ్ ఆక్సీజన్‍, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్, చెలేటింగ్‍ ఏజెంట్స్, నేచురల్‍ ప్లాంట్‍ ఎక్స్ట్రాక్టస్, ఎంజైమ్స్, అమినో ఆసిడ్స్, సహజ బాక్టీరియా, ఫంగిల నుంచి తయారయ్యే ప్లాంట్‍ మరియు సాయిల్‍ స్టిమ్యులంట్స్ నుంచి ఇది రూపొందుతుంది.  

ఫోలియర్‍ బ్లెండ్‍ నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను అధికం చేస్తుంది. పోషకాలను అవి లభ్యం కాని రూపంలో నుంచి లభ్యమయ్యే రూపంలోకి మారుస్తుంది. దాంతో వాటిని మొక్క స్వీకరించగలుగుతుంది. నేలకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని పెంచుతుంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 

> <
  • “Foliar“Foliar Blend” launch in India by Roshni Crop Sciences Pvt Ltd.
 
ఫోటో క్యాప్షన్‍: ​ఫోలియెర్‍ బ్లెండ్‍ ఆవిష్కరణ భారతదేశంలో రోష్ని క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్

ఫోలియర్‍ బ్లెండ్‍ను అమెరికాలో అగ్రి గ్రో సంస్థచే తయారుచేయబడి జపాన్‍కు చెందిన సమ్మిట్‍ ఆగ్రో ఇంటర్నేషనల్‍ లిమిటెడ్‍చే ఎగుమతి చేయబడుతోంది. భారతదేశంలో దీన్ని రోష్ని క్రాప్‍ సైన్సెస్‍ ప్రై.లి. మార్కెట్‍ చేస్తోంది.

ఈ ఉత్పాదన ఆవిష్కరణ సభకు సుమిటొమొ కార్పొరేషన్‍ - ఇండియా చైర్మన్‍, మేనేజింగ్‍ డైరెక్టర్‍ శ్రీమసహిరొ నరికియో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమ్మిట్‍ ఆగ్రో ఇంటర్నేషనల్‍ (జపాన్‍) ప్రోడక్ట్ హెడ్‍ శ్రీ టి.యమమొటొ, సుమిటొమొ కార్పొరేషన్‍ (ఇండియా) జనరల్‍ మేనేజర్‍ శ్రీ కనౌచి, సుమిటొమొ కార్పొరేషన్‍ సలహాదారు శ్రీ భరత్‍ పాండే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రోష్ని క్రాప్‍ సైన్సెస్‍ ప్రై.లి. ఎండీ శ్రీ ఎ.వి. నారాయణ రెడ్డి వ్యవసాయం, బ్యాంకింగ్‍ నేపథ్యం నుంచి వచ్చారు. రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న పరిష్కారాలను అందించడంపై ఆయన దృష్టి పెట్టారు.

ఆయా ఉత్పాదనలపై వివిధ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు మరియు లేబొరేటరీల్లో విస్తృత పరిశోధనలు జరిగాయి. భారత ప్రభుత్వం, ఆంధప్రదేశ్‍ ప్రభుత్వంతో సహా ప్రభుత్వ వర్గాలన్నింటికీ ఆ నివేదికలు అందించబడ్డాయి.

పంటల ఎదుగుదల, దిగుబడులను పెంచే మరెన్నో వినూత్న వ్యవసాయ ఉత్పాదనలను భారతదేశంలో ప్రవేశపెట్టాలని రోష్ని క్రాప్‍ సైన్సెస్‍ యోచిస్తోంది. స్పెషాలిటీ న్యూట్రియెంట్‍ ఫెర్టిలైజర్స్, ఆగ్రో కెమికల్స్, నీటిలో కరిగే ఎరువులను దశలవారీగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

జీవసంబంధ పనితీరును గరిష్ఠం చేయడం ద్వారా నేల నాణ్యత  మరియు పంట ఉత్పత్తి  మెరుగుపరిచేందుకు సుస్థిరదాయక, అధునాతన సాంకేతికతలు అందించడం తన లక్ష్యమని ఏవీఎన్‍ రెడ్డి తెలిపారు. నేలలో ఉండే సూక్ష్మజీవులు వృద్ధి చెందేందుకు ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని, అప్పుడే నేల ఆరోగ్యం బాగుపడుతుందని అన్నారు.

ఘనంగా జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి వ్యవసాయ ఉత్పాదనలకు చెందిన పలువురు పంపిణిదారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
రోష్ని గురించి:

రోష్ని క్రాప్‍ సైన్సెస్‍ ప్రై.లి. 2010లో అనుభవజ్ఞులైన బ్యాంకర్‍, వాణిజ్యవేత్త అయిన శ్రీ ఎ.వి. నారాయణ రెడ్డిచే నెలకొల్పబడింది. భారతదేశవ్యాప్తంగా రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఇన్‍పుట్స్ సరఫరా చేయాలన్న అభిలాషతో రోష్ని ఏర్పాటు చేయబడింది.

నాణ్యమైన విత్తనాలు, స్పెషాలిటీ న్యట్రియెంట్‍ ఫెర్టిలైజర్‍, ఆగ్రో కెమికల్స్ మరియు అధిక ఉత్పాదకత, ప్రతిఫలాల పరంగా రైతుల అంచనాలను అందుకోగలిగే ముమ్మర ఆర్‍ • డి కార్యకలాపాలతో గత ఆరేళ్ళుగా మేము రైతులు, శాస్త్రవేత్తలతో పటిష్ఠ అనుబంధాన్ని వృద్ధి చేసుకున్నాం. కొనుగోలుదారుల అంచనాలకు తగిన రీతిలో సేవలు అందించడం ద్వారా ఎరువులు, వ్యవసాయ రసాయనాలు, ఫామ్‍ మెకనైజేషన్‍లలో కూడా మేము మా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం.

\రోష్ని క్రాప్‍ సైన్సెస్‍ ప్రై.లి. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‍ ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది.

జపాన్‍కు చెందిన సుమిటొమొ కార్పొరేషన్‍ ఉత్పాదనలకు రోష్ని పంపిణిదారుగా, దిగుమతిదారుగా ఉంది. ఫోలియర్‍ బ్లెండ్‍, సీలీఫ్‍, అక్రెసియో, యాక్టిసీడ్‍, వాటర్‍ సోలబుల్‍ ఫెర్టిలైజర్స్, స్పెషాలిటీ న్యూట్రియెంట్‍ ఫెర్టిలైజర్‍, ఆగ్రోకెమికల్స్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఉత్పాదనలు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలచే తయారు చేయబడుతాయి.

సుమిటొమొ కార్పొరేషన్‍ గురించి:

సుమిటొమొ మూలాలు 17వ శతాబ్ది మొదట్లో ఉన్నాయి. మసాటొమొ సుమిటొమొ (1585-1652) క్యోటోలో ఒక పుస్తకాలు, ఔషధ దుకాణం ప్రారంభించారు. మొదట్లో సుమిటొమొ ప్రధాన వ్యాపారం కాపర్‍ మైనింగ్‍. దాంతో పాటుగా ఫైనాన్స్, బీమా, ఐరన్‍ అండ్‍ స్టీల్‍, రసాయనాలు, రియల్‍ ఎస్టేట్‍ రంగాల్లోకి వ్యాపారం వైవిధ్యీకరణ చెందింది. ఇప్పుడు సుమిటొమొ జపాన్‍కు ప్రాతినిథ్యం వహించే ప్రముఖ వ్యాపార సంస్థల్లో  ఒకటిగా ఉంది. (790 అనుబంధ కంపెనీలు).

తన గ్లోబల్‍ నెట్‍వర్క్తో మరియు వివిధ పరిశ్రమల్లోని కంపెనీలు మరియు వినియోగదారులు కనబరిచే విశ్వాసంతో సుమిటొమొ కార్పొరేషన్‍ బహుముఖ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించగలుగుతోంది. జపాన్‍లో వివిధ వస్తుసేవల విక్రయాలు, ఎగుమతి, దిగుమతులు, దేశీయ, అంతర్జాతీయ బిజినెస్‍ ఇన్వెస్ట్మెంట్‍ లాంటివి వీటిలో ఉన్నాయి.

సంప్రదింపు వివరాలు:
రోష్ని క్రాప సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
పేరు: సంతోష్
మొబైల్: ​7799017744

 


More News from Roshni Crop Sciences Pvt Ltd.

15/06/2017 10:05PM Image

சுமிடோமா கார்ப் இந்தியாவில் அறிமுகம் செய்யும் ஃபோலியர் பிளென்ட் சூப்பர்-ஃபெர்டிலைஸர்

இந்த வாரம் ஜப்பான் நாட்டின் சுமிடோமா கார்ப்பரேஷன் மற்றும் ரோஷ்னி கிராப் சயின்சஸ் பிரைவேட் லிமிடெட் இடையிலான கூட்டாண்மையில், வேளான் துறையில் ஒரு புரட்சிகரமான தயாரிப்பு ...

15/06/2017 8:55PM Image

सुमितोमो कॉर्प ने फोलिअर ब्लेंड सुपर फर्टिलाइजर भारत में पेश किया

जापान के सुमितोमो कॉरपोरेशन ने रोशनी क्रॉप साइंसेज प्राइवेट लिमिटेड के साथ मिलकर खेती के क्षेत्र में इस सप्ताह एक क्रांतिकारी उत्पाद पेश किया। फोलिअर ब्लेंड नई पीढ़ी की टेक्नालॉजी का प्रतिनिधित्व करता है। इसमें जटिल ...

14/06/2017 4:10PM Image

Sumitomo Corp Launches Foliar Blend Super-fertilizer in India

A revolutionary product in the field of agriculture was launched earlier this week by Sumitomo Corporation, Japan, in collaboration with Roshni Crop Sciences Pvt Ltd. Foliar Blend represents a new generation of ...

Similar News

16/01/2018 5:21PM

Panasonic Highlights 100th Anniversary, Future Vision at CES 2018

2018 marks the 100th anniversary of Panasonic's founding. As well as expressing thanks for the company's success over the past 100 years, this year's booth at CES was focusing on visual content to introduce ...

No Image

16/01/2018 4:29PM Image

The Acclaimed Japanese Children Picture Book "Mottainai Grandma" Released in India with JICA Support

JICA facilitated the book launch of the first of its kind picture book for children, ”Mottainai Grandma” by Kodansha Co. Ltd., at the World Book Fair, New Delhi. The book teaches children the importance of lessening ...