ఈ కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన శ్రీ రావు, 1977-82 సంవత్సరాల మధ్య ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేశారు. అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన జెమినీ గ్రూప్ ని ఈయన నెలకొల్పారు. మిడిల్ ఈస్ట్‌లో రియల్ ఎస్టేట్, ఎనర్జీ ట్రేడింగ్ మరియు సంపద నిర్వహణ రంగాల్లో ఒక ప్రఖ్యాత వ్యాపార సంస్థగా ఉంది. పారిశ్రామికవేత్తగా శ్రీ రావు ఇండియా మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో విదయ మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు బాగా మద్దతు ఇస్తున్నారు.
తాను అందించిన తోడ్పాటుపై జెమినీ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ సుధాకర రావు స్పందిస్తూ, ‘‘నేను చదువుకున్న కాలేజికి రుణాన్ని తీర్చుకోవాలనే సుదీర్ఘ కాల కోరికను తాను ఇప్పుడు తీర్చుకున్నాను. ఎన్ఐటి వరంగల్ లో ప్రతిష్టాత్మక డిగ్రీ పొందడమే కాకుండా, నా కలలను సాకారం చేసుకోగలననే బలమైన విశ్వాసం కూడా కలిగినందుకు నేను చాలా గర్విస్తున్నాను’’ అని అన్నారు.
శ్రీ రావు ఇచ్చిన డబ్బు అధునాతన ఇన్నొవేషన్ మరియు ఇంకుబేషన్ సెంటర్ని నెలకొల్పేందుకు వినియోగించడం జరుగుతుంది. ‘‘నవ తరం విద్యార్థుల యొక్క కలలకు ఈ హాల్ సాధికారికత కల్పిస్తుందని, పారిశ్రామికవేత్తను కావాలనే కోరికను యువత మనసులో నాటుతుందని మరియు ఉజ్వల భవిష్యత్తుకు రెక్కలు తొడుగుతుందనే విశ్వాసం నాకు ఉంది’’, అని కూడా శ్రీ రావు అన్నారు.
జెమిని గ్రూప్ గురించి
జెమినీ ప్రాపర్టీ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది. భారతదేశం మరియు మిడిల్ ఈస్ట్‌లో 30 సంవత్సరాలకు పైగా విజయవంతంగా వ్యాపారం నిర్వహించిన అనుభవంతో ఒక ప్రఖ్యాత వ్యాపార గ్రూపుగా ఉంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు అధునాతన, సరసమైన ధర గల విలాసవంత ప్రాపర్టీలను అభివ్రుద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించింది.
లెగసీ ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్రఖ్యాత సంపదన నిర్వహణ కంపెనీ, భారతదేశ వ్యాప్తంగా సంపద అడ్వయిజరీ మరియు కుటుంబ కార్యాలయ సేవలందిస్తోంది.
ఫోటోలు మల్టీమీడియా గ్యాలరీ అందుబాటులో ఉంది: https://www.businesswire.com/news/home/52110415/en
సంప్రదించవలసిన వివరాలు:
పూర్తి పేరు: అజయ్ బజాజ్
ఫోన్: + 910 99209 28757
ఈ-మెయిల్: [email protected]
