WHY US

Partner with us for Press release distribution and get best in class service, guaranteed postings on tier 1 media and maximum reach

(NSE:BAJAJFINSV)(BSE:532978)

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి హోమ్స్ అండ్ లోన్స్‌తో ఒక ప్రాపర్టీని వెదికి, ఫైనాన్స్ పొందండి

  • Friday, July 12, 2019 5:35PM IST (12:05PM GMT)
 
Pune, Maharashtra, India:  బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది దేశంలోని అత్యంత వైవిధ్యమైన ఎన్.బి.ఎఫ్.సి.లలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఒక 100% సబ్సిడరీ. ఇంటిని కొనాలనుకునే వారికి వన్ స్టాప్ హౌజింగ్ పరిష్కారం ఐన, బజాజ్ హౌసింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి హోమ్స్ అండ్ లోన్స్ ను ఇటీవలే ఇది ఆరంభించింది. ఒక ఇంటిని గుర్తించి, ఫైనాన్స్ చేయడానికి ఎంతో సమయం పట్టవచ్చు మరియు విసుగుపుట్టించవచ్చు, అయితే హోమ్స్ అండ్ లోన్స్ ఈ ప్రక్రియను సులభతరం చేసి, త్వరగా చేసిపెడుతుంది. కొనదగిన ఇళ్ళను షార్ట్‌లిస్ట్ చేసి, మీరు కొనేందుకు అవసరమైన ఫైనాన్స్‌కు ప్రవేశ సౌలభ్యత కల్పించడంలో సహాయపడేదాకా ఇంటిని కొనే ప్రక్రియ మొత్తం పూర్తయ్యేవరకు ఇది మీకు సహకరిస్తుంది. ఇంకా, మీ డాక్యుమెంట్లను క్రమంలో అమర్చేందుకు కూడా మీరు సహాయాన్ని పొందుతారు.

ఈ సమగ్ర హౌసింగ్ పరిష్కారం, మీరు ఇంటిని కొనే అనుభవాన్ని ఎలా మెరుగుపరుస్తుందో కనుగొనేందుకు ఇంకా చదవండి.
 
వ్యక్తిగత సహకారంతో దేశవ్యాప్తంగా ఎంచుకోబడిన ప్రాపర్టీల నుండి ఎంచుకోండి

మీ కుటుంబానికి ఒక సరైన ఇంటిని కనుగొనడం అనేది అత్యున్నతమైనది, మరియు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి హోమ్స్ అండ్ లోన్స్, తమ వెబ్‌సైట్ మీద ప్రాపర్టీలను జాబితా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకిష్టమైన సిటీని ఎంచుకుని, మీరు కోరుకున్న ప్రాంతంలో ఒక ప్రాపర్టీ కొరకు వెదకండి. మ్యాప్‌ను ఉపయోగించి, మీరు నివశించాలనుకుంటున్న ఖచ్చితమైన ప్రదేశానికి నేవిగేట్ చేస్తూ మీ శోధనను ఫైన్-ట్యూన్ చేయండి, ఆపై దాని గురించి మరింత తెలుసుకునేందుకు ప్రాపర్టీ లిస్టింగ్ మీద క్లిక్ చేయండి.
 
బిల్డరు మరియు ప్రాపర్టీ గురించిన సమాచారాన్ని పోర్టల్ మీకు అందిస్తుంది, మరియు స్కూళ్ళు, ఆసుపత్రులు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, లేదా గుళ్ళు గోపురాల వంటి సమీపంలో గల సౌకర్యాల గురించి ఒక ఐడియాను కూడా మీరు పొందుతారు. జిమ్నాషియం, క్లబ్ హౌజ్, ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, 24-గంటల పవర్ బ్యాకప్ వంటి ఇన్-హౌజ్ వసతులను కూడా మీరు చూడవచ్చు మరియు తదనుగుణంగా ప్రాపర్టీని అంచనావేయవచ్చు. ఇంకా, మీకు నచ్చిన ప్రాపర్టీలను కూడా మీరు షార్ట్‌లిస్ట్ చేసి, వాటిని ఒకసారి చూడవచ్చు. వాస్తవానికి, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు ఎటువంటి ఛార్జీ చేయకుండా, ఒక ఎగ్జిక్యూటివ్‌తో బాటుగా సైట్ విసిట్లను అందిస్తారు, తద్వారా ఒక అనుభవజ్ఞునితో మీరు ఒక ప్రాపర్టీని మదింపు చేయవచ్చు.
 
రూ.3 కోట్ల వరకు త్వరిత ఫండింగుతో మీరు కోరుకున్న ఇంటిని మరియు కాన్ఫిగరేషనును పొందండి

ప్రాపర్టీల గురించి అపార్ట్‌మెంట్ కాన్ఫిగరేషన్లు, వాటి ధరలు మరియు ఆరంభ ఇ.ఎం.ఐ.లు వంటి విలువైన సమాచారాన్ని కూడా వెబ్‌సైట్ జాబితా చేస్తుంది. ఈ విధంగా, ఆరంభం నుండే మీరు మీ బడ్జెట్ ప్రకారంగా అవగాహనతో కూడిన నిర్ణయాన్ని తీసుకోగలరు.
 
ఒక హోంలోన్ ద్వారా రూ.3 కోట్ల ఆర్ధిక సహాయాన్ని మీకు హోమ్స్ అండ్ లోన్స్ అందిస్తాయి కాబట్టి మీరు రాజీ పడవలసిన అవసరం ఏమీ లేదు. తదనంతరం, మీరు దీనిని దీర్ఘ క్రమానికి మరియు ఎకనామికల్ వడ్డీరేటుకు పొందుతారు. ఒకవేళ, ఎక్స్ట్రా పార్కింగ్ స్పేస్ లేదా ఒక జిమ్ మెంబర్‌షిప్ లేదా మీ ఇంటిని మెరుగుపరుచుకోవడం వంటి యాడ్-ఆన్‌ల కొరకు మీకు అదనపు ఫైనాన్స్ అవసరమైతే, ఒక అధిక-విలువతో కూడిన టాప్-అప్ లోన్‌ను కూడా మీరు పొందవచ్చు. అదనంగా, మీరు ముందస్తు చెల్లింపులను చేయవచ్చు, ఇంకా అదనపు ఛార్జీలు లేకుండా మీ లోన్‌ను ముందస్తుగా మీరు క్లోజ్ చేయవచ్చు.
 
మొదటి నుండి చివరి దాకా డాక్యుమెంటేషన్ సహాయంతో మీ కలల సౌధంలోకి మీరు మారండి

ప్రక్రియ అంతా అవాంతరాలు లేకుండా ఉండేలా నిర్ధారించుకునేందుకు, ఒక బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంటేషన్ ఆవశ్యకతలతో మీకు సహాయం చేస్తారు, తద్వారా ఇంటిని కొనుగోలు చేసే ఫార్మాలిటీలను సులభంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడతారు.
 
హోమ్స్ అండ్ లోన్స్‌తో, మీరు కలలుగన్న ప్రాపర్టీని కొనుగోలు చేసే ప్రక్రియ, ఒత్తిడి, ఆందోళనలు లేకుండా సాగిపోతుంది. వాస్తవానికి, వేగవంతమైన 72-గంటల లోన్ అప్రూవల్ పొందడం ద్వారా ప్రక్రియను మీరు మరింత వేగిరపరచవచ్చు. మీరు చేయవలసిందల్లా మీ ప్రీఅప్రూవ్డ్‌‌ ఆఫర్‌ను చెక్ చేసుకుని, ఒక అనుకూలపరచబడిన డీల్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవడమే.
 
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది దేశవ్యాప్తంగా 21 మిలియన్లకు పైగా వినియోగదారులకు వినియోగదారు, వాణిజ్య మరియు ఎస్.ఎం.ఇ. ఆర్ధిక సదుపాయం కల్పిస్తూ, 19 ఉత్పత్తి క్రమాలతో దేశంలోని అత్యంత వైవిధ్యమైన ఎన్.బి.ఎఫ్.సి.లలో ఒకటైన, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఒక 100% సబ్సిడరీ. వారి హెడ్ క్వార్టర్స్ పూణెలో ఉన్నది, ఇళ్ళు, స్థలాలు లేదా వాణిజ్య స్థలాలను కొనుగోలు చేసేందుకు, నిర్మించుకునేందుకు మరియు పునర్నిర్మాణం చేసుకునేందుకు వ్యక్తులకు అలాగే కార్పొరేట్ సంస్థలకు ఆర్ధిక సహాయాన్ని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అందిస్తుంది. వ్యాపారం, వ్యక్తిగత అవసరాల కొరకు ప్రాపర్టీ మీద ఋణాలను కూడా ఇది అందిస్తుంది అలాగే వ్యాపార విస్తరణ ప్రయోజనాలకు వర్కింగ్ క్యాపిటల్ (నిర్వహణా మూలధనం) ను కూడా అందిస్తుంది. ఇళ్ళ నిర్మాణంలో ఉన్న బిల్డర్లకు, డెవలపర్లకు ఆర్ధిక సహాయాన్ని కూడా అందిస్తుంది. అత్యధిక క్రైసిల్ ఎఎఎ (స్థిర) రేటింగును కలిగి ఉన్నందుకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గర్విస్తున్నది.

మరింత తెలుసుకునేందుకు: https://www.bajajhousingfinance.in


Click here for Media Contact Details

Violet Vaz, Bajaj Finserv, [email protected]

Ayushi Kakkar, Bajaj Finserv, [email protected]

Submit your press release

Copyright © 2025 Business Wire India. All Rights Reserved.